ఏలూరులో దొరికిన బాలికలు

ELR: పదో తరగతి పరీక్షలు రాసిన ఇద్దరు మైనర్ బాలికలు ఇన్స్టాగ్రామ్‌లో పరిచయమైన ఆగంతక వ్యక్తి మాటలు నమ్మి ఇంటి నుంచి పారిపోయిన ఘటన ఏలూరు నగరంలో చోటుచేసుకుంది. ఫిర్యాదు అందిన మూడు గంటల్లో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి రెండో పట్టణ సీఐ అశోక్ కుమార్ ఆ ఇద్దరు మైనర్ బాలికలను తిరిగి తల్లిదండ్రులకు సోమవారం రాత్రి అప్పగించారు.