విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే..?
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.4,26,666 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ ద్వారా 399 మంది స్వామివారిని దర్శించుకోగా, 85 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని చెప్పారు. 2420 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.