VIDEO: 'అత్యవసరాల్లో డయల్ 100ను సంప్రదించాలి'
ADB: ప్రజలు అత్యవసర సమయాల్లో ఉంటే వెంటనే డయల్ 100ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. శుక్రవారం నార్నూర్ మండల కేంద్రంలోని డా.అంబేడ్కర్ నగరులో 'డయల్ 100'పై అవగాహన సదస్సు నిర్వహించారు. యువత గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు బానిస కావద్దన్నారు. గంజాయి సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.