వైట్‌హౌస్ వద్ద కాల్పులు.. అమెరికా కీలక నిర్ణయం
వైట్‌హౌస్ వద్ద కాల్పులు జరిగిన నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘాన్‌వాసుల ఇమిగ్రేషన్ దరఖాస్తులను అమెరికా సస్పెండ్ చేసింది. కాల్పుల ఘటనలో నిందితుడు ఆఫ్ఘాన్ వలసదారుడిగా తేలడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాగా, కాల్పుల ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందిన విషయం విధితమే.