VIDEO: శ్రీశైలం రోడ్డులో మంటలు చెలరేగి కారు దగ్ధం
NGKL: ప్రమాదవశాత్తు నిన్న రాత్రి టయోట ఫార్చునర్ కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటన అమ్రాబాద్ మండలం ఈగలపెంట వద్ద శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. కారు యజమాని హైదరాబాదులోని చిక్కడపల్లికి చెందిన ఆకుల ప్రవీణ్ కాగా, కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారని ఎస్సై జయన్న తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.