ధూళిపాళ్ల ఎన్నికల ప్రచారం

గుంటూరు: పొన్నూరు పట్టణంలోని 19వ వార్డు ఎస్టీ కాలనీలో శుక్రవారం టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కాలనీలో ఇంటింటికి కలియ తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలు అందించి పథకం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు