బీఆర్ఎస్ నాయకులు ముందస్తు అరెస్ట్
NLG: మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి సభ సందర్భంగా నకిరేకల్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రగాడపు నవీన్ రావును ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముఖ్యమంత్రి నల్లగొండ జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయకుండా మిర్యాలగూడలో ఏ విధంగా మీటింగ్ పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో సైదిరెడ్డి తదితరులు ఉన్నారు.