అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
WGL: గ్రేటర్ వరంగల్ GWMC 45వ డివిజన్ పరిధిలోని కడిపికొండ, రాంపేట, కుమ్మరిగూడెం, తరాలపల్లి గ్రామాల్లో రూ. 2 కోట్ల 47 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాగరాజు శంకుస్థాపన చేశారు. ప్రతి కాలనీ, బస్తీకి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించే బాధ్యత తనదని, నిర్ణీత సమయంలోనే పనులు పూర్తవుతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.