వరద భీభత్సం.. 145 మంది మృతి
దక్షిణ థాయ్‌లాండ్‌ను వరదలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏకంగా 145 మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ఉధృతికి లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉండగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.