'కేంద్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధికి కృషి చేస్తుంది'
KMR: పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.మండల అధ్యక్షులు మల్లయల సుభాష్ మాట్లాడుతూ.. 21వ విడత కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హత కలిగిన రైతుల ఖాతాలలో 2000 రూపాయలు జమ చేయటం జరిగిందని తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతుల,పేదల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.