వైసీపీ హయాంలో పశ్చిమ ప్రాంత అభివృద్ధి శూన్యం

వైసీపీ హయాంలో పశ్చిమ ప్రాంత అభివృద్ధి శూన్యం

ప్రకాశం: మార్కాపురంలోని 20వ వార్డులో జిల్లా ఏర్పాటు అభినందన సభలో ఎమ్మెల్యే కందుల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేదిక నుంచే ఆయన వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల వైసీపీ కాలంలో పశ్చిమ ప్రాంతానికి వరగబెట్టిందేమీలేదని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన వైసీపీ పూర్తి చేయకుండానే అంకితం చేసి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.