VIDEO: చిన్నారిపై కుక్కల దాడి
JGL: 29వ వార్ఢులోని మంచి నీళ్లబావి ప్రాంతంలో ఆదివారం ఉదయం రుతిక్ష అనే చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమేయడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. కాగా, చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రాంతంలో కుక్కల బెడదపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందనలేదని మాజీ కౌన్సిలర్ పంబాల రాంకుమార్ విమర్శించారు. ఇప్పటికైనా వాటిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.