వైకుంఠ ద్వారదర్శనం.. రేపు బుకింగ్స్ షురూ
తిరుమలలో వైకుంఠ ద్వారదర్శనాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు రేపు ఉ.10 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఇందుకోసం భక్తులు TTD యాప్, వెబ్‌సైట్ లేదా వాట్సాప్ నం. 9552300009 ద్వారా నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 1న సా.5 గంటల వరకే రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంది. ఆ తర్వాతి రోజున మ.2 గంటలకు టోకెన్ల కేటాయింపు జరగనుంది.