మంచినీటి కష్టాలు పరిష్కరించాలని డిమాండ్
ASR: హుకుంపేట మండలం పాతకోట పంచాయతీ పెదచట్టు గ్రామంలో గిరిజనులు తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. కనీస మంచినీటి సౌకర్యం లేక 5 కి.మీ. దూరంలోని కొండల నుంచి వచ్చే ఊట నీటికి పైపులైన్లు వేసుకుని దాహం తీర్చుకుంటున్నారు. అధికారులు, పాలకులు వెంటనే స్పందించి తమ మంచినీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు