అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలి ఆత్మహత్య

అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలి ఆత్మహత్య

MLG: వెంకటాపురం మండలం నేలారిపేట చెందిన సమ్మక్క (80)గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మనస్థాపానికి గురై సోమవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమ్మక్క గత కొంత కాలంగా అస్తమా, మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఇంటి ముందు నిద్రించిన సమ్మక్క తెల్లవారే సరికి కనిపించలేదు. కుటుంబ సభ్యులు గాలించగా బావిలో శవమై తేలింది.