నల్ల పోచమ్మకు ప్రత్యేక పూజలు

నల్ల పోచమ్మకు ప్రత్యేక పూజలు

MDK: కార్తీక పౌర్ణమి, గురుపౌర్ణమి సందర్భంగా కౌడిపల్లి మండలంలోని తునికి శివారులో వెలసిన శ్రీనల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. బుధవారం అమ్మవారిని పట్టు వస్త్రాలు, రంగురంగుల పూలమాలలతో అలంకరించారు. భక్తులు ఓడి బియ్యం, ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు.