రేపు నగరపాలకలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

KRNL: నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రవీంద్ర బాబు ఆదివారం తెలిపారు. ఉదయం 10:30 నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని, అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. నగర పరిధిలోని ప్రజలకు తమ కాలనీల్లో ఏవైనా స్థానిక సమస్యలు ఉంటే, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.