VIDEO: రహదారి కంకరమయం.. రాకపోకలకు ఇక్కట్లు..!
KDP: చాపాడు (M) గాంధీనగర్ నుంచి శాంతి నగరం గ్రామానికి వెళ్లే లింకు రోడ్డు పూర్తిగా దెబ్బతింది. రహదారి అంతా కంకరమయంగా మారి గుంతలు ఏర్పడటంతో రాకపోకలు సాగించేవారు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.ద్విచక్ర వాహనదారులు సైతం రాకపోకలు సాగించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరు గ్రామాల ప్రజలు రాకపోకలకు అవస్థలు పడాల్సి వస్తుందని దారిని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.