ఓపెన్ స్కూల్ పరీక్షలపై సమీక్ష
NLG: జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. థియరీ పరీక్షలు ఏప్రిల్ 20 - 27 వరకు, ప్రాక్టికల్స్ ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు జరుగుతాయి. ఉ .9 నుంచి 12 వరకు, మ. 2:30 నుంచి 5:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్‌కు 2,226 మంది, టెన్త్ కు 1,611 మంది హాజరవుతున్నారు. అడిషనల్ కలెక్టర్ అశోక్ రెడ్డి సమీక్ష జరిపారు.