మహిళలను వేధిస్తే కఠిన చర్యలు: ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ
HYD: మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ హెచ్చరించారు. గత నెల 98 ఫిర్యాదులు వచ్చాయన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం పెట్టొద్దని, ఫేక్ ప్రొఫైల్ ముఠాలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. మహిళలు వేధింపులకు గురైతే డయల్ 100, షీ టీం వాట్సాప్ 9490616555 నంబర్లకు ఫిర్యాదు చెయ్యాలని డీసీపీ సూచించారు.