భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు
E.G: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం నాలుగు పథకాలను ప్రవేశపెట్టినట్లు జిల్లా సహాయ కార్మిక కమిషనర్ విజయ ప్రకాష్ తెలిపారు. లబ్ధిదారులు తప్పనిసరిగా గుర్తింపు కార్డు కలిగి ఉండాలని, మార్చి 1, 2026 నాటికి వాటిని రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. అర్హులైన కార్మికులు అవసరమైన పత్రాలను అందజేసి ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.