చలి తీవ్రతతో వ్యక్తి మృతి..!

చలి తీవ్రతతో వ్యక్తి మృతి..!

MDK: చలికి తట్టుకోలేక వ్యక్తి మృతి చెందిన ఘటన అల్లాదుర్గం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల గ్రామానికి చెందిన బోయిని విట్టల్ వేరే గ్రామానికి వెళ్లి శుక్రవారం తిరిగి వస్తుండగా రాత్రి కావడంతో చిల్వర్ ఐబి చౌరస్తాలో నిద్రపోయాడు. రాత్రి చలి తీవ్రత ఎక్కువ ఉండటంతో అక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.