ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే చర్యలు: సీఐ

KDP: వేంపల్లె సీఐ టీ.నరసింహులు శనివారం పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చట్టాలపై అవగాహన అవసరమని, మద్యం సేవించి వాహనాలు నడపడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటివి చట్టరీత్యా నేరమని తెలిపారు.