ఆత్మకూరు ఘటన.. వైఎస్ జగన్ విచారం

ఆత్మకూరు ఘటన.. వైఎస్ జగన్ విచారం

NDL: ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో ఆటో బోల్తాపడి ఆదోనికి చెందిన నలుగురు మృతి చెందడంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీశైలం దైవ దర్శనం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు.