చింతకాని పీహెచ్సీలో మధుమేహ దినోత్సవం
KMM: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా చింతకాని పీహెచ్సీలో వైద్యాధికారి డాక్టర్ అల్తాఫ్ ఆధ్వర్యంలో ఇవాళ ప్రతిజ్ఞ చేసి అనంతరం ర్యాలీ నిర్వహించారు. తదనంతరం కలెక్టర్ లైవ్ టెలికాస్ట్ ద్వారా గుండె వైద్యులు, ఎండోక్రైనాలజిస్ట్, యూరాలజిస్ట్‌ల చేత అవగాహన సదస్సు జరిగింది. జీవనశైలి మార్పులు, నడక, ఆహార నియమాలు, క్రమం తప్పని మందుల వినియోగంపై పలు సూచనలు ఇచ్చారు.