నేటి నుంచి తిరుపతి గంగ జాతర ప్రారంభం

TPT: తిరుపతి గంగమ్మ జాతర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటలకు ఆలయ కొడిస్తంభానికి అభిషేకాలు చేసి ఒడిబాలు కడతారు. తరువాత గంగమ్మకు అభిషేకం జరుగుతుంది. సాయంత్రం గంగమ్మ పుట్టినిల్లు అవిలాలలో జాతర, అనంతరం అక్కడి నుంచి పసుపు కుంకుమలు ఆలయానికి తీసుకొస్తారు. అర్థరాత్రి సమయంలో చాటింపు వేస్తారు. వారం రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా జరగనుంది.