సంక్షేమ పథకాల గురించి వివరించిన ఎమ్మెల్యే అభ్యర్థి

సంక్షేమ పథకాల గురించి వివరించిన ఎమ్మెల్యే అభ్యర్థి

చిత్తూరు: ఐరాల మండల పరిధిలోని భీమినేనివారిపల్లి ఎస్సీ కాలనీ, ఎస్సీ కాలనీ గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.