గ్యాస్ ధరల పెంపే మహిళలకు ఇచ్చే కానుకనా? : సీపీఎం
GDWL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ వంట గ్యాస్ ధరలు పెంచి ఆడబిడ్డల కడుపు కొట్టడమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కానుకనా అని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలో గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా ధర్నా చేపట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నిరంతరాయంగా పెరుగుతున్నాయన్నారు.