పేకాట రాయుళ్ల అరెస్ట్
SRPT: పేకాట ఆడుతున్న ఆరుగురుని బుధవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు హుజూర్‌నగర్ ఎస్సై మోహన్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. హుజూర్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు దాడి చేసి, ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 27, 300 నగదు స్వాధీనం చేసుకుని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.