ఈనెల 22, 23న పుట్టపర్తిలో సీఎం పర్యటన

ఈనెల 22, 23న పుట్టపర్తిలో సీఎం పర్యటన

AP: ఈనెల 22, 23న పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. 22న సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతితో కలిసి పాల్గొననున్నారు. అనంతరం 12:30 గంటలకి రాష్ట్రపతికి వీడ్కోలు పలకనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఉపరాష్ట్రపతితో కలిసి సత్యసాయి ఇనిస్టిట్యూట్ స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు. 22న రాత్రి పుట్టపర్తిలోనే సీఎం చంద్రబాబు బస చేయనున్నారు.