VIDEO: డీఎస్పీని కలిసిన నూతన సీఐ
ప్రకాశం: కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్‌ను పామూరు సీఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మాకినేని శ్రీనివాసరావు సోమవారం రాత్రి కనిగిరి పోలీస్ స్టేషన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పామూరు సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సీఐ శ్రీనివాసరావుకు సూచించారు.