VIDEO: 7వ రోజుకు చేరిన దళిత పారిశ్రామికవేత్తల భిక్షాటన
GNTR: మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయం వద్ద దళిత పారిశ్రామికవేత్తల ఆందోళన బుధవారం 7వ రోజుకు చేరింది. ఎస్సీ, ఎస్టీ సబ్సిడీ నిధులు విడుదల చేయాలంటూ బాధితులు భిక్షాటన చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. ఏడాదిగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, పుస్తెలు అమ్ముకుని రోడ్డున పడ్డామని మహిళలు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం న్యాయం చేయాలని వేడుకున్నారు.