నేడు 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం

NDL: కోవెలకుంట్ల పట్టణంలోని స్థానిక ఆర్టీసీ డిపోలో ప్రజా రవాణా సమస్యలపై శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ తిరుపతయ్య తెలిపారు. ఆయా రూట్లలో తిరిగే బస్సు సర్వీసులపై సూచనలు, సలహాలు, ఫిర్యాదులు అందజేయాలన్నారు. 11am-12pm వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. 9959225798 నంబరుకు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలని సూచించారు.