'నాట్లు వేసే ముందు కొనలు తుంచి వేయాలి'

'నాట్లు వేసే ముందు కొనలు తుంచి వేయాలి'

మన్యం: వరి నాట్లు వేసే ముందు కొనలు తుంచి నాటడం వలన ఆకు చివర పసుపు రంగు కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. గురువారం పాచిపెంట మండలం మూలవలస గ్రామంలో వరుసలలో వరి నాట్లపై రైతులకు అవగాహన కల్పించారు. పసుపు రంగు కాండం తొలుచు పురుగు వరి ఆకుల చివర గుడ్లను పెడుతుందని నాట్లు వేసే ముందు చిగుర్లు తుంచడం మంచిది అన్నారు.