శ్రీవారి భక్తులను మోసగిస్తున్న నకిలీ వెబ్‌సైట్లు తొలగింపు

TPT: తిరుమల దర్శనం, వసతి పేరుతో శ్రీవారి భక్తులను మోసగిస్తున్న 28 నకిలీ వెబ్‌సైట్లను పోలీసులు గూగుల్ సెర్చ్ ఇంజిన్ నుంచి తొలగించారు. ఇంకా మిగిలిన వెబ్‌సైట్లను కూడా తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు టీటీడీ సేవల కోసం అధికారిక వెబ్‌సైట్ తిరుమల ఓఆర్ జీని మాత్రమే ఉపయోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.