24న సచివాలయాల వద్ద ధర్నాలు
VSP: అర్బన్‌లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలాలు, ఇల్లు నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఈనెల 24న రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ధర్నాలు చేపడతామని జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. టిడ్కో ఇళ్లను మౌలిక సదుపాయాలతో వెంటనే అప్పగించాలని, రుణాలు రద్దు చేయాలని కోరారు.