VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

కోనసీమ: అల్లవరం మండలం దేవగుప్తంలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేషన్ బియ్యం పంపిణీ చేసే వాహనం సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.