కావూరి మృతి వార్తలు.. ఖండించిన కుటుంబం

కావూరి మృతి వార్తలు.. ఖండించిన కుటుంబం

AP: కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు మృతిచెందినట్లు వార్తలొస్తున్నాయి. తీవ్ర అస్వస్థతతో HYDలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆయన తుదిశ్వాస విడిచారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను కావూరి కుటుంబ సభ్యులు ఖండించారు. ఆయన చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేశారు. అధికారికంగా తాము చెప్తే తప్ప ఇలాంటి వార్తలు ప్రసారం చేయొద్దని కోరారు.