రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తిమృతి

రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తిమృతి

VSP: విశాఖ రైల్వేస్టేషన్ వద్ద బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్-1వ గేట్ నంబర్ 2 సమీపంలో సుమారు 60 సంవత్సరాల వ్యక్తి బుధవారం మృతి చెందాడు. మృతుడి పేరు, ఊరు తెలియాల్సి ఉందని జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.