VIDEO: అమ్మవారి సేవలో మాజీ ఎమ్మెల్యే
SKLM: పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని గురువారం దర్శించుకున్నారు. ఈ మేరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 108 కొబ్బరికాయలు కొట్టారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.