రోడ్డు ప్రమాదంలో టీడీపీ కార్యకర్త మృతి

సత్యసాయి: ఎర్రవంకపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త గోపాల్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం హాస్పిటల్‌కి వెళ్లి గోపాల్ పార్థివ దేహాన్ని సందర్శించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి, కొంత మొత్తం ఆర్థికసాయం చేశారు.