సింహాచలంలో కొత్త ఆకర్షణ

సింహాచలంలో కొత్త ఆకర్షణ

VSP: సింహాచలంలో బస్సులు ఆగే ప్రదేశంలో మెయిన్ రోడ్ పక్కన ‘I LOVE SIMHACHALAM’ అనే ఎల్ఈడీ బోర్డును ఏర్పాటు చేశారు. గోడపై నంది, గోమాత, తదితర చిత్రాలతో పెయింట్‌ను అపురూపంగా తీర్చిదిద్దారు. ఈ గోడ పైనే బోర్డును ఏర్పాటు చేయడంతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. తొలి పావంచ వద్ద రాత్రి వేళ విద్యుత్‌ కాంతులతో ఎంతో అందంగా కనిపిస్తుందని స్థానికులు తెలిపారు.