ముఖ్యమంత్రిపై దాడి హేయమైన చర్య: హరికృష్ణ

NZB: ఢిల్లీ ముఖ్య మంత్రి రేఖాగుప్తాపై దాడి హేయమైన చర్య అని రుద్రూర్ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ పేర్కొన్నారు. గురువారం రుద్రూర్ బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదన్నారు. దాడి చేసిన వారు ఎంతటి వారైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.