పలు రైళ్లలో తనిఖీలు నిర్వహించిన సీఐ

పలు రైళ్లలో తనిఖీలు నిర్వహించిన సీఐ

VZM: ఏపీలో మాదకద్రవ్యాల నియంత్రణకు 'ఆపరేషన్ వజ్రప్రహర్' వేగవంతమైంది. ఇందులో భాగంగా విశాఖ లైన్స్ సీఐ ఏ.రవికుమార్ విజయనగరం మీదుగా వెళ్లే రైళ్లలో శనివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా కార్టెన్ సెర్చ్ నిర్వహించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు.