'గిరిజన విద్యార్థులకు చదువు దూరం చేయకండి'

CTR: గిరిజన విద్యార్థులను చదువుకు దూరం చేయొద్దని నల్లగుట్టపల్లి తాండా వాసులు కోరారు. గ్రామంలో ఉన్న పాఠశాలను సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూజగానిపల్లి పాఠశాలకు మార్పు చేయడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు బాణావతి, మునీంద్ర నాయక్ తదితరులు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని సోమవారం కలిసి సమస్యను వివరించారు.