మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధుల పోరాట ఫలితంగానే స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.