'బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి'
BDK: భద్రాచలంలో బీసీ సాధన సమితి సంఘం నాయకులు సోమవారం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్టకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సాధన సమితి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.