VIDEO: 'మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'

KDP: వినాయక చవితి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా నిర్వహించుకోవాలని వేంపల్లి సీఐ నరసింహులు తెలిపారు. మంగళవారం వేంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వినాయక మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. డీజేలు గానీ, రికార్డు డ్యాన్సులకు గానీ అనుమతులు లేవని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలన్నారు.