నేడు జిల్లాలో జాబ్ మేళా
GDWL: జిల్లాలో నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నేడు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎం.ఏ.ఎల్.డి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమం జరగనుంది. వివిధ కంపెనీలలో సుమారు 500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 18 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ చేసిన వారు అర్హులు అని పెర్కొన్నారు.