VIDEO: గద్దర్ వేషంలో ఎమ్మెల్యే నాగరాజు నృత్యం
WGL: తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ కార్యక్రమంలో ఆదివారం రాత్రి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి, పోలీస్ క్రిష్ణయ్య త్యాగాలను స్మరిస్తూ కళా ప్రదర్శన చేశారు. అనంతరం గద్దర్ వేషధారణలో “పొడుస్తున్న పొద్దు” పాటకు నృత్యం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.